ఏపీలో తిరిగే రైళ్లతో పాటు రాష్ట్రం గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎం.కె.త్రిపాఠి ప్రకటన విడుదల చేశారు. విజయవాడ, గుంటూరు డివిజన్‌లో మౌలిక సదుపాయాల పనుల కారణంగా రైళ్ల రద్దు చేయడం లేదా పాక్షిక రద్దు చేయడం, మళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. ట్రైన్ల రద్దు, మళ్లింపు వివరాలు ఇలా ఉన్నాయి.
నడికూడి-కాచిగూడ(07792), కాచిగూడ-నడికూడి(07791), మచిలీపట్నం-గుడివాడ(07869), గుడివాడ-మచిలీపట్నం(07868), విజయవాడ-విశాఖపట్నం(22702), విశాఖపట్నం-విజయవాడ(22701), విశాఖపట్నం-గుంటూరు(17240), గుంటూరు-విశాఖపట్నం(17239), విశాఖపట్నం-కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం(17267), విశాఖపట్నం-రాజమండ్రి(07467), రాజమండ్రి-విశాఖపట్నం(07466), బిట్రగుంట-విజయవాడ(07977), విజయవాడ-బిట్రగుంట(07978), చెన్నై సెంట్రల్-బిట్రగుంట(17238), బిట్రగుంట-చెన్నై సెంట్రల్(17237) రైళ్లను 26వ తేదీ నుంచి జులై 2 వరకు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.
అలాగే విజయవాడ-గుంటూరు(07783), గుంటూరు-విజయవాడ(07788), గుంటూరు-మాచర్ల(07779), మాచర్ల-గుంటూరు(07780), మాచర్ల-నడికూడి(07580), నడికూడి-మాచర్ల(07579), తెనాలి-రెపల్లె(07875), రెపల్లె-తెనాలి(07876), గుంటూరు-డోన్(17228) రైళ్లను 26వ తేదీ వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు(17227) రైలును 27వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు. ఇక నర్సాపూర్-గుంటూరు(17282), గుంటూరు-నర్సాపూర్(17281) రైళ్లను 26 నుంచి 2వ తేదీకి రద్దు చేశారు. అలాగే గుంటూరు-కాచిగూడ(17251), కాచిగూడ-గుంటూరు(17252) రైళ్లను 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
అటు రేపల్లె-మార్కాపురం(07889), మార్కాపూరం-తెనాలి(07890) రైళ్లను గుంటూరు-మార్కాపురం, మార్కాపురం-గుంటూరు మధ్య 26వ తేదీ నుంచి వచ్చే 2 వరకు పాక్షికంగా రద్దు చేశారు. ఇక హుబ్లీ-విజయవాడ(17329) ట్రైన్‌ను నంద్యాల-విజయవాడ మద్య 26 నుంచి 4వ తేదీ వరకు, విజయవాడ-హుబ్లీ(17330) ట్రైన్‌ను విజయవాడ-నంద్యాల మధ్య 27 నుంచి 5వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.