ఏపీలోని పలుచోట్ల రోడ్లు రక్తసిక్తం అయ్యాయి. పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో పలువురు దుర్మరం పాలయ్యారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు.
బొలేరో వెహికల్‌ను ఐచర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హోళగుంద నుంచి తెలంగాణ వెళ్తుండగా జిల్లాలోని కోడుమూరు సమీపంలో బొలేరో వాహనాన్ని ఐచర్ ఒక్కసారిగా ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్ధానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు ఇవ్వనున్నారు. మృతులను హోళగుంద మండలానికి చెందిన మల్లయ్య (హెబ్బటం), వీరయ్య ( కురుకుంద), ముత్తయ్య (కొత్తపేట)గా పోలీసులు గుర్తించారు. గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. వారితో కొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.