విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెరుకుపల్లి ఎస్ఐ డి. వెంకట కొండారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం చెరుకుపల్లిలో శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులచే అంబేద్కర్ సెంటర్లో మానవహారం గా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారు తమ జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై కూడా పడుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు బ్రహ్మం, శ్రీనివాసరావు, విద్యార్థులు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.