ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో 10 లక్షల టన్నుల ఎరువులను రైతు భరోసా కేంద్రాలకు తరలించినట్లుగా సోమవారం తెలిపారు. రాష్ట్రానికి 5 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా, 4 లక్షల టన్నుల విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు వివరించారు.
ఇందులో భాగంగానే కోస్తాంద్రకు వరి, రాయలసీమకు వేరుశనగా విత్తనాలు సిద్దంగా ఉంచామని స్పష్టం చేశారు. ఒకవేళ వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే. , ఉలవలు, చిరుదాన్యలు వంటివి కూడా సిద్దం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.