పలమనేరు పట్టణం సీపీఎం ఆఫీసు నందు ఆదివారం పోలవరం నిర్వహితుల పోరు కేక పాదయాత్ర పోస్టరు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేసినట్టున్నాయని, అసలు ఇండియా మ్యాప్ నుంచే విలీన మండలాలను తొలగించినట్లు అనిపిస్తోందని సీపీఎం నాయకులు అన్నారు. నిర్వాసితుల సమస్యలపై జూన్ 20న మహా పాదయాత్ర ప్రారంభించారని. ఎటపాక నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టి నిర్వాసితుల గోడును పాలకుల ముందు సిపిఎం పార్టీ ఉంచుతుందన్నారు. పునరావాస చర్యలు కానరావడం లేదన్నారు. సీఎం చింతూరు పర్యటన సమయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయన్నారు. గతేడాది వరదల సమయంలో కనీసం తాగు నీటిని ఈ ప్రభుత్వం అందించలేకపోయిందన్నారు. విపక్షాలు సైతం నిర్వాసితుల గోడుపై ప్రశ్నించడం లేదన్నారు. ఐద్వా జిల్లా కన్వీనర్ భువనేశ్వరి జిల్లా కార్యదర్శి ఈశ్వర్ మాట్లాడుతూ సీపీఎం నిర్వాసితుల పక్షాన నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ముంపు గ్రామంలో గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. వరదల సమయం వస్తున్నందున ప్రభుత్వం మేలుకోవాలన్నారు. చిన్నపాటి వరదకే విలీన మండలాలు ముంపునకు గురవుతున్న విషయం గమనించాలన్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా జూన్ 15 నాటికే వరద సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉందన్నారు. ప్రజావ్యతిరేకత రాకముందే ప్రభుత్వం నిర్వాసితులకు చట్టపరంగా వర్తించే ప్రతి సదుపాయాన్ని, నష్ట పరిహారాన్ని అందజేయాలన్నారు. విలీన మండలాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ జరిపించాలన్నారు. కాంటూరు కాకి లెక్కలు మాని క్షేత్ర స్థాయి పరిశీలన మేరకు ముంపును గుర్తించాలన్నారు. ఎటపాక మండలంలో తమ బృందం ఉపాధి హామీ పనులను పరిశీలన చేయగా కూలీలకు కనీస వసతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైన విషయం వెల్లడైందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు.