“డయల్ యువర్ మేయర్” కు 14, “జగనన్న కు చెబుదాం”కు 86 ఆర్జీలు వచ్చాయని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో “డయల్ యువర్ మేయర్”, “జగనన్న కు చెబుదాం” కార్యక్రమాలలో జివిఎంసి కమిషనర్ సి. ఎం. సాయికాంత్ వర్మ తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ “డయల్ యువర్ మేయర్” కార్యక్రమంలో 14 ఆర్జీలు వచ్చాయని, వాటిలో విభాగాల వారీగా ఇంజినీరింగ్ కు 8, టౌన్ ప్లానింగ్ కు 1, డిసి(రెవెన్యూ) కు 1, పబ్లిక్ హెల్త్ కు 1, యుసిడి కు 3 వచ్చాయి. అలాగే “జగనన్న కు చెబుదాం” లో మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో రెండవ జోన్ కు 12, మూడువ జోన్ కు 6, నాల్గవ జోన్ కు 8, ఐదవ జోన్ కు 9, ఆరువ జోనుకు 21, ఏడవ జోన్ కు 1, ఎనిమిదివ జోన్ కు 10, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 19 ఫిర్యాదులు, మొత్తము 86 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిలో పరిపాలన & అక్కౌంట్స్ కు 4, రెవెన్యూ కు 5, పబ్లిక్ హెల్త్ కు 13, టౌన్ ప్లానింగ్ కు 41, ఇంజినీరింగ్ కు 15, మొక్కల విభాగానికి 2, యుసిడి కు 6 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలింఛి ఆ ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న “జగనన్న కు చెబుదాం” కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరిస్తున్న వినతులు, సలహాల అంశాలపై ఆయా విభాగాధిపతులు చేపట్టిన చర్యలకు సంబంధించి వివరాలతో కూడిన సమాచారంతో. , తరువాత వారం వచ్చే “జగనన్న కు చెబుదాం” కార్యక్రమానికి ముందుగా సమర్పించవలసిన వివరాలుతో ఆయా విభాగాధిపతులు సిద్ధం చేయాలని కమిషనర్ తెలిపారు. ఆయా వివరాలను తరువాత వారంలో సమర్పించడం వలన నిర్ణీత సమయంలో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆయన అధికారులకు సూచించారు.