దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో 62,970 పాయింట్ల వద్ద ముగియగా... నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 18,691 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (1.67%), టాటా మోటార్స్ (1.54%), టైటాన్ (1.14%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.56%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-0.86%), రిలయన్స్ (-0.84%), ఎన్టీపీసీ (-0.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.64%), ఎల్ అండ్ టీ (-0.55%).