ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్చరికలు భేఖాతర్... విషాదం మిగిలిన టైటానిక్ శకలాల సందర్శన

international |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 09:40 PM

అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ శిధిలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో వెళ్లిన టైటాన్ సబ్-మెరైన్ పేలిపోయిన ఘటన ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఆందోళన కలిగించే దుర్ఘటనలలో ఒకటి. ఈ విపత్తు సముద్రం అడుగు భాగంలోని టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్లేవారి భద్రత గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. టైటానిక్ నౌక శకలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్లే ఓషన్ గేట్ సంస్థ వద్ద ఉన్న సబ్-మెరైన్లు 4,000 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ లోతకు చేరుకోగలవు. అయితే, గతవారం పేలిపోయిన టైటాన్‌ భద్రతను ఏ రెగ్యులేటరీ బాడీ కూడా ధ్రువీకరించలేదని నివేదికలు చెబుతున్నాయి.


సముద్ర అన్వేషణ నిపుణులతో పాటు ఓషన్ గేట్ ఉద్యోగుల్లోని ఓ సీనియర్ కూడా టైటాన్ భద్రతపై హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు. అయితే, 3,700 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ శిధిలాల సందర్శన ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన యాత్రలలో ఒకటి. టైటానిక్ నౌక మునిగిపోయిన 75 సంవత్సరాల తర్వాత గుర్తించిన శిధిలాలను ఇప్పటి వరకూ దాదాపు 250 మంది పర్యాటకులు చూసి వచ్చారు. వీరిలో ఒకరు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన ఏకంగా 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లి రావడం గమనార్హం.


అయితే, 1995లో మూడోసారి పైలట్ డాక్టర్ అనాతోలీ సాగలెవిచ్, మరో రష్యన్ ఇంజనీర్‌తో కలిసి కామెరూన్ వెళ్లినప్పుడు ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. సముద్రపు అడుగుభాగంలో ఇసుక తుఫాను ఎదుర్కొన్నారు. ‘పైలట్ చెప్పేది ఎప్పటికీ వినకూడదు.. మేము ఒక సెకను పాటు కళ్లు మూసుకున్నాం’ అని 2009లో వెలువరించిన తన జీవిత చరిత్ర 'ది ఫ్యూచరిస్ట్'లో కామెరూన్ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు.


‘బలమైన ప్రవాహాలు సబ్ విద్యుత్ సరఫరాను తగ్గించాయి.. దాదాపు బ్యాటరీలు ఆగిపోయాయి.. సముద్రపు అడుగుభాగానికి వెళ్లడానికి బదులుగా సిబ్బంది డైవ్‌ను నిలిపివేశారు.. ఓడ పైకి లేవడం ఆగిపోయి మళ్లీ సముద్రపు అడుగుభాగంలోకి వెళ్లింది.. అరగంట సేపు వేచి చూసిన తర్వాత పైలట్ మళ్లీ ప్రయత్నించారు.. కానీ సబ్ 80 అడుగుల వద్ద మళ్లీ ఆగిపోయింది. మూడో ప్రయత్నంలో 80 అడుగుల మార్క్ నుంచి పైకి లేచి ఐదు గంటల తర్వాత ఉపరితలాన్ని చేరుకుంది’ అని తెలిపారు.


ఇక, 1991లో కెనడాకు చెందిన సముద్రగర్భ అన్వేషకుడు డాక్టర్ జో మాక్‌ఇన్నిస్... జీవ, భౌగోళిక అధ్యయనాలతో పాటు ఐమ్యాక్స్ చిత్రంలో శిధిలాలను సంగ్రహించడానికి కూడా ఒక సాహసయాత్రను చేపట్టారు. ఈ సాహసయాత్రలో రెండు రష్యన్ మినీ జలాంతర్గాములు 17 డైవ్‌లు చేయగా... చివరిది చిక్కుకుపోయింది.


టైటానిక్ నౌక శిథిలాలను షూట్ చేసిన తర్వాత పైకి రావడానికి పైలట్ ప్రయత్నించగా అది ఇరుక్కుపోయిందని గ్రహించారు. వారికి సహాయంగా వచ్చిన రెండో సబ్ ల్యాండింగ్ స్కిడ్ చాలా కిందకు జారిపడిందని గుర్తించి, దాని నుంచి ఎలా బయటపడాలో వారికి దిశానిర్దేశం చేసింది. ‘మేము రెండో సబ్ కారణంగా స్వీయ-రక్షణ సామర్థ్యం కలిగి ఉన్నాం.. కాబట్టి చాలా అదృష్టవంతులం’ మాక్‌ఇన్నిస్ టైమ్స్ రేడియోతో అన్నారు.


అలాగే, 2000లో మైఖేల్ గిల్లెన్ టైటానిక్ శిధిలాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. 88 ఏళ్లలో అలా చేసిన మొదటి రిపోర్టర్‌గా అవతరించాలని ఆయన ఆశపడ్డారు. టైటానిక్ శిధిలాల ముందు భాగాన్ని దాటినప్పుడు సబ్ వేగం పెరగడంతో కామెరూన్ మాదిరిగానే ప్రవాహంలో వారు చిక్కుకున్నారు. ‘క్షణాల్లో తమ సబ్ టైటానిక్ ఇంజిన్ సమీపానికి దూసుకెళ్లిడంతో షాక్‌కు గురయ్యాను.. తుప్పుపట్టిన శిధిలాల ముక్కలు మా జలాంతర్గామిపై పడ్డాయి.. పోర్ట్‌హోల్ ద్వారా స్పష్టంగా చూడలేకపోయాం’ అని గిల్లెన్ ‘బిలీవింగ్ ఈజ్ సీయింగ్’ అనే పేరుతో రాసిన తన పుస్తకంలో తెలిపారు. సబ్- మళ్లీ పైకి రావడానికి ముందు సముద్ర ఉపరితలంలో చిక్కుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com