యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకుంటూ ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారన్న మంచి ఆలోచనతో ఈ లా నేస్తం పథకం ప్రారంభించామని సీఎం జగన్ అన్నారు. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసి మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసుపరంగా నిలదొక్కుకోవాల్సి అవసరం ఉందన్నారు. ఇందుకు వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5 వేల చొప్పున మూడేళ్లలో రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4 ఏళ్లలో 5,781 మంది యువ న్యాయవాదులకు.. రూ.41.52 కోట్లు అందించామని సీఎం జగన్ చెప్పారు.