తూర్పు కాపుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి భీమవరంలోనే బీజం పడిందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతున్నారు.. కానీ, 45 లక్షల మంది తూర్పు కాపులున్నారని అన్నారు. సీఎం అవ్వడం అన్నింటికీ మంత్ర దండం కాదని.. సీఎం అయ్యాక కూడా అధికారుల్లో, నాయకుల్లో అడ్డుపడుతారన్నారు. ఒక్క ఎమ్మెల్యే పని చేయడు.. ప్రశ్నిస్తే భూతులు తిడతారని అన్నారు.