ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో తేజ సూపర్ షో,,,రెండు సెంచరీలు బాదిన తెలుగు కుర్రాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 27, 2023, 07:37 PM

వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ‌లో నెదర్లాండ్స్ వెస్టండీస్ సంచలన విజయం సాధించింది. రెండు సార్లు వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్‌ను సూపర్ ఓవర్లో డచ్ జట్టు ఓడించింది. ఈ మ్యాచులో శతకంతో చెలరేగిన తేజ నడమూరు మన తెలుగు కుర్రాడే కావడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత తేజ గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. తెలుగు కుర్రాడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఆ విశేషాలు మీ కోసం..


అతడి పూర్తి పేరు అనిల్‌ తేజ నిడమనూరు. తేజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. 1994లో ఆగష్టు 22న పాండురంగారావు, పద్మావతి దంపతులు తేజకు జన్మనిచ్చారు. తేజ ఏడళ్ల వయసులో ఉన్నప్పుడే అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు షిఫ్ట్ అయింది.


పాఠశాలలో చదువుతున్న సమయంలోనే తేజకు ఆటలపై ఆసక్తి ఏర్పడింది. న్యూజిలాండ్‌లో అభిమాన క్రీడ రగ్బీలో అతడు పట్టుసాధించాడు. అనుకుకోకుండా క్రికెట్ వైపు మళ్లాడు. ఆక్లాండ్లో తల్లి పని చేస్తున్న చోటుకు పక్కనే ఉండే ప్రఖ్యాత "కార్న్‌వాల్ క్రికెట్ క్లబ్"లో రోజూ ఆటను చూస్తూ పెరిగాడు. తేజ ఆసక్తిని గమనించి అతని తల్లిదండ్రులు అందులో చేర్పించగా.. స్థానిక లీగ్‌లలో సత్తాచాటిన తేజ.. ఆక్లాండ్ "ఎ" టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆక్లాండ్ సీనియర్ టీం తరఫున కూడా ఆడాడు.


ఆటగాడిగా ఎదిగే క్రమంలో ఆక్లాండ్‌లో పరిస్థితులు తేజకు అర్థమయ్యాయి. సీనియర్లు ఉండటం, ఇతర కారణాలతో టీంలో అవకాశాలు రాకపోవడంతో.. ఇంగ్లాండ్ కౌంటీ డర్హమ్ మైనర్ లీగ్‌లో తేజ అడుగుపెట్టాడు. ఒప్పంద ముగిసిన తర్వాత మళ్లీ న్యూజిలాండ్‌కు వచ్చాడు. నెదర్లాండ్స్‌లో గతంలో క్రికెట్ ఆడిన తేజ అక్కడే పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడితే భవిష్యత్‌లో ఎదగవచ్చని భావించాడు. అందుకోసం నిబంధనల ప్రకారం నెదర్లాండ్స్‌లో ఓ ఉద్యోగంలో చేరాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే నెదర్లాండ్స్‌లో కనీసం దేశంలో మూడేళ్లు నివాసం ఉండాలి. 2019 మేలో నెదర్లాండ్స్‌లో అడుగుపెట్టిన తేజ.. 2022లో మూడేళ్ల గడువు పూర్తి చేసుకున్నాడు.


2022లోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 28 ఏళ్ల తేజ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 రన్స్ చేశాడు. అప్పటి నుంచి నెదర్లాండ్స్ టీంలో కీలక సభ్యుడిగా మారి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.


తాజాగా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచు సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒక వేళ డచ్ టీం వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తే.. తెలుగు కుర్రాడైన తేజ.. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్న ఇప్పటివరకు నెదర్లాండ్స్ తరఫున 16 వన్డేలు, 6 టీ-20 మ్యాచులు ఆడాడు.


ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నికోలస్ పూరన్ 65 బంతుల్లో 104 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 374 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు వీరోచిత శతకంతో(111, 76 బంతుల్లో) విరుచుకుపడటంతో సరిగ్గా 50 ఓవర్లు ముగిసే సమయానికి 374 పరుగులు చేసింది. ఇరు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. అనంతరం జరిగిన సూపర్ ఓవర్‌లో జింబాబ్వే ఆటగాడు లోగన్ వాన్ బీక్ సెన్సేషనల్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. వరుసగా 4,6,4,6,6,4 కొట్టడంతో నెదర్లాండ్స్ 30 పరుగులు చేసింది. 31 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 8 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఫలితంగా వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com