తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం తాడిమేడులో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట్రమణా రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడుతూ..... ‘మీ నాయకుడికి దమ్ము, ధైర్మం ఉంటే తడబడకుండా, పేపర్ చూడకుండా గంటపాటు మీడియాతో మాట్లాడమను.పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పమను చాలు. మీ నాయకుడి చదువు, తెలివితేటలు గొప్పవని ఒప్పుకుంటాం. ఉత్తుత్తి ప్రమాణాలు చేసి, మీ పాపిష్టి పనులకు దేవుళ్లను డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేరుగా జనంలోకి రండి అక్కడే తేల్చుకుందాం’ అంటూ ధ్వజమెత్తారు. ‘మీ బాబాయ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌తో సహా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో ఆఖరికి మంత్రులతో కూడా నీకు ఎందుకు పడటంలేదు? తన బాబాయ్‌కి వచ్చిన ఇంటర్నేషనల్ నోటీస్ వ్యవహారం దాచిపెట్టానని మరో మాజీ మంత్రే చెబుతుంటే సుమోటోగా తీసుకుని అతనిపై చర్యలు ఎందుకు తీసుకోరు? తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నెల్లూరు సహా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ వ్యవహారాలపై కేంద్రప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించాలి’ అని డిమాండు చేశారు. ‘ ఆనం కుటుంబాన్ని అంతం చేసేటంత వాడివారా నువ్వు? అరేయ్ బచ్చా.. మా కుటుంబాన్ని అంతం చేసేవాడు ఇంకా పుట్టలేదు.. మీరు మమ్మల్ని ఏమీచేయలేరు. మీకులాగా అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తించం. ఎప్పుడూ వరదలే రాని సర్వేపల్లి కాలువపై గోడలు కట్టించి ప్రజాధనం కొట్టేసిన ముద్దపప్పు అనిల్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.