రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అథారిటీని, ఎన్నికల అధికారులను నియమిస్తూ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్ మంగళవారం గజిట్ జారీ చేశారు. ఎన్నికల అథారిటీగా మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిని, డిప్యూటీ ఎలక్షన్ అథారిటీగా మైనార్టీ సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీని, ఎన్నికల ఆఫీసర్‌గా మైనార్టీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్, కమిషనర్‌ను, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా మైనార్టీ సంక్షేమశాఖ సెక్షన్ అధికారిని నియమిస్తున్నట్లు గజిట్లో స్పష్టం చేశారు.