ఇటీవల పేరేచర్ల జగనన్న కాలనిలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు మేడికొండూరు సీఐ వాసు మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. వివరాల ప్రకారం సత్తెనపల్లికి చెందిన సైదేశ్వరరావు హత్యకు గురికాగా. బంధువులే వేట కొడవళ్లతో నరికి హత్య చేసినట్లు సీఐ వాసు తెలిపారు. గుంటూరుకు చెందిన శిరీష, సత్తెనపల్లికి చెందిన సుధాకర్‌కు వివాహం కాగా ఇద్దరి మధ్య గొడవలు అవడంతో శిరీష పుట్టింటికి వచ్చింది. శిరీష బంధువు సైదేశ్వరావు తమ మధ్య గొడవ పెంచుతున్నారని సుధాకర్ మరో ముగ్గురితో కలిసి సైదేశ్వరావును పేరేచర్ల జగనన్న కాలనీ వద్ద హత్య చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.