పాయకరావుపేట మండలం మంగవరం పీ హెచ్ సీ పరిధిలో ఈ నెల 26 నుండి జూలై 16 వ తేది వరకు కుష్ఠు వ్యాధి నివారణపై అవగాహన, ఇంటింటా సర్వే చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన నేతృత్వంలో ఎంపీహెచ్ఈవో పొట్నూరి రాముడు పర్యవేక్షణలో కుష్టు వ్యాధి నిర్థారణ పరీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ మంగవరం పీహెచ్ సి పరిధిలో 24వేల జనాభా కు సర్వే చేసేందుకు 19 టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటింటి సర్వే చేసి ఏ రకమైన మచ్చలున్నా పరీక్షలు చేసి కుష్టు వ్యాధి అని నిర్ధారణయితే మందులను ఉచితంగా ఆసుపత్రి లోనే ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని స్వచ్చందంగా ప్రజలు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంతవరకు 12 అనుమానిత కేసులు వచ్చాయని వాటిని పరీక్ష చేయగా అవి కుష్ఠు వ్యాధి కాదని నిర్ధారించామని చెప్పారు.