జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం, గురువారం వారాహి యాత్రకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం పవన్ భీమవరంలో బస ఉండగా.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లపై మాత్రం నాయకులతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ నెల 30న భీమవరం సభ తర్వాత వారాహి యాత్రకు స్వల్ప విరామం ఇస్తున్నట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అనంతరం తిరిగి ప్రారంభించి వారాహి యాత్ర రూట్ మ్యాప్‌పై నేతలతో చర్చించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa