ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో అమ్మఒడి నగదు రూ.252.55 కోట్లు జమచేసినట్లు కలెక్టర్ వెంకట్రమణా రెడ్డి తెలిపారు. గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం అమ్మఒడి నగదు నమూనా చెక్కును విద్యార్థుల తల్లులకు ఆయన అందజేశారు.ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుతున్న 1,68,367మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లుల ఖాతాల్లో రూ.252.55 కోట్లు జమవుతుందన్నారు.ఎమ్మెల్యే వరప్రసాద రావు, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర రావు, బల్లి కళ్యాణ్‌చక్రవర్తి,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ పొణకా దేవసేనమ్మ, ఎల్లసిరి గోపాల రెడ్డి, డీఈవో శేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, డిప్యూటీ ఈవో శివప్రకా్‌షరెడ్డి, ఎంఈవోలు దేవరాజులరెడ్డి, కాంచన, బొమిడి శ్రీనివాసులు, భారతి తదితరులు పాల్గొన్నారు.