విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. ప్రయాణికులు తక్కువగా ఉన్నారనే కారణం చూపుతూ వాటిని ఎత్తేశారు. అక్కడ టిక్కెట్లు అమ్మడం ఆపేశారు. గత మే నెల 1న 16 స్టేషన్లను మూసివేస్తూ రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది. అల్లూరు రోడ్డు స్టేషన, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద్, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద్ద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీవేంకటేశ్వరాపురం, తలమంచి, తెలప్రోలు, వట్లూరు స్టేషన్లను క్లోజ్ చేశారు. అక్కడి సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నెల 1 నుంచి కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం చింతపర్లు స్టేషన్లను కూడా ఎత్తేశారు.