కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం మార్కెట్ నందు కాయగూరల ధరలు ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు పంట దెబ్బతిందని రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.పంట దెబ్బతినడంతో మార్కెట్కి వచ్చే కూరగాయలు సగానికి సగం సప్లై తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాల నుండి టమాట, పచ్చిమిర్చి, క్యారెట్ వంటి కూరలు తీసుకువచ్చి రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందించాలని కోరుతున్నారు. ధరల క్రమబద్ధీకరణ చేసి వినియోగదారులపై భారం పడకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.