భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2023ని "మిల్లెట్ల సంవత్సరంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఇందులో భాగంగా బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో శనివారం. చిరు ధాన్యాల్లో విలువ జోడింపు ద్వారా వ్యవస్థాపకత ఎలా చేయవచ్చు" అన్న అంశం పైఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ జాగర్లమూడి లక్ష్మి ప్రసంగించారు. చిరుధాన్యాల నుంచి ఎన్ని ఆహార పదార్ధాలు తయారు చేయవచ్చు అన్న దాని మీద , వీటి ద్వారా మనం ఎలా వ్యవస్థా పక వ్యవస్థని స్తాపించవచ్చు అని విద్యార్థులకి తెలిపారు. సాంప్రదాయ భారతీయ వంటకాలలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ప్రధానమైన, పోషక విలువలు కలిగిన మిల్లెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయి అని చెప్పారు. వీటిని తక్కువ భూమిలో, పరిమిత నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతంల్లో పండించవచ్చు.
భారత ప్రభుత్వం దేశీయ వినియోగం, ఎగుమతి రెండింటికీ ఆహార ఉత్పత్తిని పెంచడానికి హైబ్రిడ్. అధిక దిగుబడి నిచ్చే గోధుమలు, బియ్యం పండించే విధంగా రైతులను ప్రోత్సహించింది. ఇందువల్ల చిరుధాన్యాలు అనేవి గ్రామీణ , గిరిజన వర్గాల ఆహరంగా చూస్తున్నారని ఇక ఆ దృక్పథం మార్చుకొని చిరుధాన్యాలని పోషకాహారంగా ప్రజలకు తెలియజేసే భాద్యత ఆహార సాంకేతిక నిపుణులు అయిన ప్రతి విద్యార్థి యొక్క కర్తవ్యం అ తెలియజేసారు. చిరుదాన్యాల మీద వ్యవస్థాపకాలు చేయడం. వల్ల ప్రజలకు ఆరోగ్యం , దేశానికి ఆదాయం రెండు లభిస్తాయి అని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీ న్ వై. రాధ , ప్రొఫెసర్ డాక్టర్ వివి సత్యనారాయణ , వినోద, బోధన సిబ్బంది సి. హెచ్ సామేశ్వర రావు , ఎన్ ఎస్ ఎస్ అధికారి డాక్టర్ విమల బేరా కె. సౌజన్య , డాక్టర్ ఎస్ బ్లెస్సీ శ్రీ ఫణి బోధనా సాగర్ శ్రీనివాస్, ప్రీతీ సాగర్. తదితరులు పాల్గొన్నారు.