ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకం లో భాగంగా అనకాపల్లి 80 వ వార్డు 19, 22 సచివాలయాల పరిధిలో గల అరుంధతి నగర్ లో 80 వార్డు కార్పొరేటర్ కొనసాల నిల్వ భాస్కర్ ఆధ్వర్యంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ జగనన్న సురక్ష పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ మరియు వాలంటరీ వ్యవస్థను ప్రారంభించి నూతన శకానికి నాంది పలికిన ఘనత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుంది అన్నారు. జగనన్న సురక్ష పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించడం. ప్రజలకు కావలసిన వివిధ సర్టిఫికెట్లను మరియు పథకాల విషయంలో ఉన్న ఇబ్బందులను వాలంటీర్ల ద్వారా సచివాలయాలకు చేరవేసి వీలైనంత తొందరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 80 వార్డు కార్పొరేటర్ కొణతల నీలిమ భాస్కర్, కొణతల మురళీకృష్ణ, జీవీఎంసీ కమిషనర్ వెంకటరమణ, డిప్యూటీ తాసిల్దార్ శ్రీరామ్ మూర్తి ,వాటర్ హౌస్ ఈ ఈ జీవీఎంసీ ఆర్ఐ మర్ర శేఖర్ ,అధిక సంఖ్యలో కార్యకర్తలు ,మహిళలు పాల్గొన్నారు.