పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఆదోని కార్యవర్గ సభ్యుడు అజయ్ బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, సుదర్శన్, సీపీఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ, ఈరన్న, లక్ష్మన్న, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు మల్లికార్జున, మునెమ్మ, ఎంకప్ప డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయం నుంచి ర్యాలీగా స్థానిక విద్యుత్ కార్యాలయం వరకు వెళ్లి కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ ఏడు సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారన్నారు. విద్యుత్ సంస్కరణల పేర్లతో వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకించకుండా మీటర్లు బిగించేందుకు సానుకూలంగా ఉండటాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు ఓబీ నాగరాజు, లక్ష్మీనారాయణ, విజయ్, కుమారస్వామి, హనుమంతు, గంగన్న, నాగరాజు, గుడిసె ఈరన్న, ఎల్లప్ప, సిద్దిలింగ పాల్గొన్నారు.