రెండు మూడు రోజుల్లో గ్రామ పంచాయతీల పీఎఫ్‌ఎంఎస్ బ్యాంకు ఖాతాల ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదల చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. 202223 సంవత్సరానికి సంబంధించి కేంద్రం రూ.2,010 కోట్లు కేటాయించిందని, దానిలో మొదట విడతగా రూ.988కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను స్థానిక సంస్థలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన రూ.988 కోట్లకు గ్రాంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ తయారుచేసి, మిగిలిన రూ.988కోట్లు విడుదలకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. కమిషనర్ వివరణపై సర్పంచ్‌లు సంతృప్తిగా లేరు. గతంలో కూడా పలు దఫాలు ఇలాగే అధికారులు మభ్యపెట్టారని, ఆర్థికశాఖ అధికారులు మాత్రం సీఎంవో ఆదేశాలతో నిధులను లాగేసుకుంటున్నారని అంటున్నారు.