దాదాపు అన్ని బడా కంపెనీలు గతేడాదే లేఆఫ్స్ మొదలు పెట్టి ఇంకా కొనసాగిస్తున్నాయి. గడిచిన 6 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు 819 టెక్ కంపెనీలు 2,12,221 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. మొత్తంగా ఈ రెండేళ్లలో 3.8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొవిడ్ సంక్షోభం తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు పేర్కొంటున్నారు.