అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినం సందర్భంగా వార్వా నివాస్ సోమవారం మధురవాడ లోని ఐటీ సైజ్ లో హరిత అపార్ట్మెంట్స్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ప్లాస్టిక్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానవాళికి, జీవరాశి కి అత్యంత ప్రమాదకరం గా తయారయిందని చిత్ర పటాలు ప్రదర్శించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు, సీసాలను శాస్త్రీయ పద్ధతిలో నాశనం చెయ్యాలి. కానీ అలా జరగకుండా మన దేశంలో 85% మిసమనజ్మెంట్ అవుతున్నది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం, రోడ్ల పైన పారి వెయ్యడం జరుగుతున్నది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వలన ప్లాస్టిక్ వేస్ట్ గాల్లో చేరుతుంది. ఆ గాలి పీల్చుకుని మనం జబ్బులు తెచ్చుకుంటున్నాము. రోడ్లపై పారి వేసిన ప్లాస్టిక్ సంచులు, సీసాలు కాలువల్లో చేరి జామ్ చేస్తున్నాయి. దోమల కారక మవుతున్నాయి. కాలువల ద్వారా నదులలోనికి, సముద్రం లోనికి చేరి జీవరాశులకు హానికరం అవుతున్నాయి. జలచరాల ద్వారా మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరం లోనికి చేరి ప్రమాదకరం అవుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో కలిసి పోవడానికి 700 సంవత్సరాలు పడుతుంది. ఏటేటా ప్లాస్టిక్ వేస్ట్ పెరిగిపోతున్నది. నాశనం కావడం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ముఖ్యంగా సంచులు, సీసా లను స్ట్రిక్ట్ గా నిషేధించ వలసి ఉంది. ఈ దశలో జీవీఎంసీ వారు కఠినమైన నిర్ణయాలు చెయ్యవలసి ఉంది. నగర ప్రజలు గా మనం కూడా ప్లాస్టిక్ సంచులు, సీసాల వాడకాన్ని మానెయ్యాలి. వీటికి బదులుగా గుడ్డ సంచులు, జూట్ సంచులు వాడాలి. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, మన జీవితాలను, మన భవిష్యత్ తరాన్ని, మనతో బాటు ఇతర జీవరాశులను రక్షించుకోవాలి. ఈ కార్యక్రమంలో వార్వా ప్రధాన కార్యదర్శి బి బి గణేష్, నివాస్ ప్రధాన కార్యదర్శి Pitta పిట్టా. నారాయణ మూర్తి మధురవాడ జోన్ అధ్యక్షుడు సిచ్ గోవింద రావు , హరిత గార్డెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎమ్. మాధవి రాణి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి. బుల్లి బాబు , తనూజ, పుష్ప లత, , సుదర్శన రావు, మాజీ కార్పొరేటర్ ఆర్ బాబూ రావు, శేషగిరిరావు, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.