తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక కమిటీకి రూపకల్పన చేశారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, పి.కృష్ణయ్య, ఎస్.రాజశేఖర్ (ఇన్చార్జి), పి.కృష్ణమోహన్, వాజ్జా శ్రీనివాసరావు, చిరుమామిళ్ల ప్రసాద్, కోనేరు సురేష్లను నియమించారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో ఓటరు జాబితా పర్యవేక్షణ కమిటీని నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.