మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీలో చీలికకు కారణమైన అజిత్ పవార్. సీఎం ఏక్నాథ్ షిండే కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవిని పొందారు. ఆయనతో పాటు వచ్చిన వారిలో 9 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఈ క్రమంలో షిండే కేబినెట్లో తొలిసారిగా ఓ మహిళా మంత్రి పదవి దక్కింది. శ్రీవర్ధన్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన అదితి తట్కరేకు తాజాగా మంత్రి పదవి దక్కింది.