కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, లక్ష్యసేన్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తాలియాతో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ లో వితిద్‌సరన్‌తో లక్ష్యసేన్ ఢీకొట్టనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ర్యాంకింగ్ పాయింట్లు సాధించాలనే లక్ష్యంతో వీరిద్దరూ బరిలో దిగనున్నారు.