ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగ్నలింగ్ వైఫల్యం వల్లే ఆ రైలు ప్రమాదం,,,,స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు పట్టించుకోని అధికారులు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 10:13 PM

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2న జరిగిన రైలు ప్రమాదానిక సిగ్నలింగ్ లోపమే కారణమని రైల్వే భద్రత కమిషనర్ నివేదిక స్పష్టం చేసింది. షాలీమార్‌-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్ ట్రాక్ నుంచి లూప్‌ లైన్‌లోకి వచ్చి.. అక్కడ ఆగి ఉన్న గూడ్సును ఢీకొట్టడంతో దాని బోగీలు పట్టాలపై పడ్డాయి. ఈ సమయంలో యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1,000 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.


ఈ ఘోర ప్రమాదానికి తప్పుడు సిగ్నలే కారణమని, దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని సీఆర్ఎస్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ మేరకు రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించిన సీఆర్ఎస్... దుర్ఘటనకు దారితీసిన కారణాలను అందులో విశ్లేషించింది. తప్పుడు వైరింగ్‌, కేబుల్‌ అనుసంధానం వల్ల 2022 మే 16న ఆగ్నేయ రైల్వే ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఇదే తరహాలో జరిగిన ప్రమాదం నుంచి పాఠాలు నేర్చుకొని, లోపాన్ని సరిచేసి ఉంటే ఈ ఘోరం తప్పేదని అభిప్రాయపడింది. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంది.


సిగ్నల్‌ వ్యవస్థలో లోపాలున్నాయని, రెండు సమాంతర మార్గాలను అనుసంధానం చేసే స్విచ్‌లు పలుసార్లు అసాధారణంగా పనిచేస్తున్నాయని బహానగా బజార్‌ స్టేషన్‌ మేనేజర్‌ చేసిన ఫిర్యాదును సిగ్నల్‌-టెలికాం సిబ్బంది పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టి ఉండాల్సిందని అన్నారు.  ‘ప్రమాదం జరిగిన స్టేషన్‌ సమీపంలోని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ 94 వద్ద ‘ఎలక్ట్రిక్‌ లిఫ్టింగ్‌ బ్యారియర్‌’ను మార్చే పనుల ఆమోదానికి నిర్దిష్ట సర్క్యూట్‌ డయాగ్రమ్‌ను సరఫరా చేయకపోవడం వల్లే తప్పుడు వైరింగ్‌ జరిగింది. కొందరు క్షేత్రస్థాయి పర్యవేక్షకులు వైరింగ్‌ డయాగ్రమ్‌ను మార్చినా దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు. లెవెల్-క్రాసింగ్ లొకేషన్ బాక్స్ లోపల కేబుల్స్ తప్పుగా లేబులింగ్ చేసిన విషయాన్ని సంవత్సరాలుగా గుర్తించబలేదని, చివరికి నిర్వహణ సైతం గందరగోళానికి దారితీసిందని పేర్కొంది. గతంలో ఉన్న లోపాలను విస్మరించకుండా ఉంటే పెను విషాదాన్ని నివారించేవారిమని వివరించింది.


ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన వేగంగా ఉండాలి. రైల్వే జోన్లకు, విపత్తు నిర్వహణ బృందాలకు మధ్య సమన్వయంపై సమీక్ష జరగాలని సూచించింది.


ఉత్తర సిగ్నల్‌ గూమ్టీ వద్ద గతంలోని సిగ్నలింగ్‌లో తప్పిదం వల్లనే గూడ్సు రైలును వెనుక నుంచి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. సిగ్నల్‌ వైరింగ్‌ ఫోటోలు, ఇతర పత్రాలను, సర్క్యూట్లను ఆధునీకరించే పనులు ముమ్మరంగా చేపట్టాలి.. ఈ ఆధునికీకరణ పనులకు ప్రామాణిక నిర్వహణను అనుసరించాలి. సిగ్నల్‌ సర్క్యూట్లలో ఎలాంటి మార్పు చేయాలన్నా ఆమోదిత రేఖాచిత్రం ఉండాలి. మార్పులు చేసిన సిగ్నల్‌ సర్క్యూట్ల పనితీరును పరీక్షించి, మార్గాన్ని పునరుద్ధరించే ముందు తనిఖీ చేయడానికి విడిగా ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలి అని పేర్కొంది.


‘కేబుల్స్ అనుసంధానం చేసిన లొకేషన్ బాక్స్‌లో తప్పు సంకేతాలు ఉన్నాయి.. అంటే అవి విధులను తప్పుగా సూచించాయి.. సీఆర్సీ 2015లోనే దీనిని గుర్తించింది.. కంప్లీషన్ వైరింగ్ రేఖాచిత్రం- నిర్వహణ పని తర్వాత వైరింగ్‌ తిరిగి ఎలా కనెక్ట్ చేయాలనుకుంటున్నారో సాంకేతిక నిపుణులకు కేవలం పేపర్లుపై మాత్రం ఉంది.. కానీ లేబులింగ్ మార్పు భౌతికంగా జరగలేదు..టెర్మినల్ ర్యాక్‌లో సర్క్యూట్ పేర్లు సరిదిద్దలేదు’ అని నివేదిక వివరించింది.  మళ్లీ 2018లో సిగ్నల్ పాయింట్‌ను గుర్తించే సర్క్యూట్ స్థానం లొకేషన్ బాక్స్‌లో మార్చారు.. కానీ రేఖాచిత్రంలో కానీ, కేబుల్ టెర్మినల్ ర్యాక్‌లో మార్పునకు అనుగుణంగా లేబుల్ చేయలేదు అని తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com