జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలల్లో నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా, విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టి, ప్రమాదాల నివారణకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనులపై విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు. తరగతి గదుల మరమ్మతులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.