సత్యవేడు మండలంలోని దాసుకుప్పం, ఆంబాకం సచివాలయ పరిధిలో తహసిల్దారు షేక్ జరీనా, ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు రవి రెడ్డి, సంగీత కనకరాజ్, నాగమణి అధ్యక్షతన జగనన్న సురక్ష నిర్వహించారు. మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారికి లబ్ది చేకూర్చడం కోసమే జగనన్న సురక్ష చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.