ఖాజీపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాగసానిపల్లె గ్రామంలో బుధవారం వ్యాధినిరోధక టీకాల ప్రోగ్రామ్, ఎల్సిడిసి ప్రోగ్రామ్, కంటి వెలుగు ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది గ్రామస్తులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారులు మాచనూరు రాఘవయ్య, బి. నాగభూషణం, సూపర్ వైజర్స్ శోభన్ బాబు, కృష్ణప్రియ, ఏయన్ యం జె. రాధ, ఆశా కార్యకర్త సువార్తమ్మ పాల్గొన్నారు.