చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ బస్సుయాత్ర’ బుధవారం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియమితమైన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యాత్ర బుధవారం చిత్తూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉదయం 10.30 గంటలకు ముత్తిరేవుల వద్దకు చేరుకుంటుంది. 11 గంటలకు టిడ్కో ఇళ్ల పరిశీలన, 11.12 గంటలకు ఎన్టీయార్ జలాశయం.. 12 గంటలకు మురకంబట్టులోని అపోలో కళాశాల.. 12.15 గంటలకు కొత్త కోర్టు భవన నిర్మాణం పరిశీలించనున్నారు. 12.20 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహనికి, 12.30 గంటలకు గాంధీ విగ్రహానికి, 12.40 గంటలకు జడ్పీ కార్యాలయం వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నారు. 1.15 గంటకు బీసీ భవన్ పరిశీలన, 1.30 గంటలకు చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు ద్విచక్ర వాహనాల ర్యాలీగావెళ్లి 2 గంటలకు గుడిపాల చేరుకుంటారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, అన్న క్యాంటీన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.15 నుంచి 3 గంటల వరకు భోజన విరామం, సాయంత్రం 6 గంటలకు చిత్తపారలో రచ్చబండ నిర్వహించి అక్కడే రాత్రి పల్లె నిద్ర చేస్తారు. నియోజకవర్గంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.