అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన వారం తర్వాత, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియో గురువారం అధికారికంగా నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని ఓ అధికారి తెలిపారు.ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సలహా మేరకు త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ డియోను ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.అంతకుముందు రోజు, క్యాబినెట్ సమావేశానికి ముందు, బఘెల్ ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న సింగ్ డియోను పుష్పగుచ్ఛంతో స్వాగతించారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సింగ్ డియో కలిశారు.