గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో గోరఖ్‌పూర్-లక్నో, జోధ్‌పూర్-అహ్మదాబాద్ (సబర్మతి) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్‌పై ఉంచిన గోరఖ్‌పూర్ జంక్షన్ స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నమూనాను వీక్షించిన తర్వాత, రిమోట్ బటన్‌ను నొక్కడం ద్వారా ప్రధాని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత, గవర్నర్ ఆనంది బెన్ పటేల్ మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవి కిషన్ శుక్లా, రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ లోహతి, ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ చంద్రవీర్ రామన్ తదితరులు పాల్గొన్నారు.