ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించడం జరుగుతుందనీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రెటరీ మిన్హజ్ ఆలం తెలిపారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్ నందు న్యూ ఢిల్లీ నుంచి మిన్హజ్ ఆలం ఈ పథకం అమలుపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.