ఈరోజు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, సీఎం జగన్ ఇద్దరూ మొదటిసారి వేర్వేరు సమయాల్లో నివాళులు అర్పించనున్నారు.ఈరోజు ఉదయం షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించనుండగా, సీఎం జగన్ మధ్యాహ్నం 1:55 నిమిషాలకు ఇడుపులపాయ చేరుకొని నివాళులు అర్పిస్తారు.ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్త పడి ఎవరికివారే వేర్వేరు సమయాల్లో పాల్గొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa