జాతీయ విద్యా విధానం అమలు వల్ల విద్యార్థులకు మేలు కలగడంతోపాటు దేశ అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య టీవీ కట్ట మణి అన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం 561. 9 ఎకరాలను కేటాయించిందని, త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా భూమిపూజ జరుగుతుందని తెలిపారు.