పశ్చిమ బెంగాల్ త్వరలో ఖాళీ కానున్న 6 రాజ్యసభ స్థానాలకు సీఎం మమతా బెనర్జీ అభ్యర్థుల్ని ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఈ ఆరు స్థానాల్లో పోటీ చేయబోయేది డెరెక్ ఒబ్రియాన్, సుఖేందు శేఖర్, డోలాసేన్, సాకేత్ గోబ్లే, ప్రకాశ్, సమీరుల్లుగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది.