నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.