రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాల్సిందేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమలవుతుందన్నారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్పకుండా ఆరు నెలలకు ఒకసారి నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. రూ.13,295 కోట్ల పెట్టుబడులతో 10,181 ఉద్యోగాలను కల్పించే పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్‌పీబీ ఆమోదం తెలిపింది.