టమాటా ధర తక్కువైనా..ఎక్కువైనా రైతులను, వినియోగదారులను ఆదుకుంటామమని, అధిక ధరలు ఉన్నంత వరకు సబ్సిడీపై టమాటా అందిస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కృష్ణలంక రైతు బజార్‌ను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సందర్శించారు.రైతు బజారులో వినియోగదారులతో మంత్రి మాట్లాడారు. సబ్సిడీపై అందిస్తున్న టమాటా కౌంటర్‌ను మంత్రి పరిశీలించారు. 103 రైతు బజార్లలో సబ్సిడీ టమాటా ఇస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ..వినియోగదారులు నష్టపోవద్దనే సీఎం వైయస్ జగన్ ఆలోచన అన్నారు. వినియోగదారులకు జరుగుతున్నా మేలును పక్కదారి పట్టించాలన్నదే టీడీపీ ప్రయత్నమని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీడీపీ ఎన్ని టన్నుల టమాటాలు ఇచ్చింది ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం 10 కేజీలు అమ్మి ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదన్నారు.