టెక్కలి పరిధిలోని సీతారాంపల్లికి చెందిన బోలుపద్ర గరికమ్మ (62) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై సోమవారం రాత్రి పేలు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. గరికమ్మకు భర్త గంగయ్య, కుమారులు వెంకటరావు, శోభనబాబు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ-2 కె.రమేష్‌బాబు తెలిపారు.