అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీలో టీడీపీ మరియు వైసీపీ వర్గీయుల మధ్య చిచ్చు రగిలింది. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, రాంబాబు, గోపాల్, బాషా తీవ్రంగా గాయపడ్డారు. మొదట గోపాల్‌పై దాడి జరిగింది. ఆస్పత్రిలో అతన్ని పరామర్శిస్తుండగా మిగిలిన ముగ్గురిపై దాడి జరిగింది. తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గన్నెవారిపల్లి సర్పంచ ఉమా మహేష్, ముగ్గురు ఎంపీటీసీలు కలిసి.. ప్రజా సమస్యలపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలోనే దాడి జరిగిందని టీడీపీ వర్గీయులు అంటున్నారు.