ఒక్క పైసా లంచం లేకుండా రూ.2.25 లక్షల కోట్లను ప్రజలకు అందించిన నిస్వార్థ సేవకులు వాలంటీర్లు అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కొనియాడారు. నార్పల మండలం కర్ణపుడికి, గడ్డంనాగేపల్లి గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగనన్నను దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. మీలాంటి వాళ్లందరూ ఎన్ని మాట్లాడినా, ప్రజలెవరూ పట్టించుకోరని అన్నారు. వాలంటీర్లతో పెట్టుకుంటే ఏమవుతుందో ఈపాటికే పవన్ కల్యాణ్ కి అర్థమైందనుకుంటానని అన్నారు. వాలంటీర్లకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు.