తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో కొన్ని రోజుల క్రితం ఓ బాలుడిపై దాడి చేసిన ఘటన భక్తులు మర్చిపోక ముందే మరొకసారి పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ వార్తతో కొండపైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఘాట్‌రోడ్డులోని 56వ మలుపు దగ్గర చిరుత పులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించటంతో 56వ మలుపు దగ్గరకు చేరుకున్న విజిలెన్స్ అధికారులు తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్ని అనుమతిస్తున్నారు. పులిని ఘాట్ రోడ్డు పరిసరాల్లోంచి అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు డబ్బు శబ్ధాలు చేస్తున్నారు.