భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్దం చేశారు. కాసేపట్లో చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఈ తెల్లవారు జామున పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. అక్కడ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన సూక్ష్మ నమూనాను తిరుమల శ్రీవారి ఆలయానికి తెచ్చారు సైంటిస్ట్‌లు.