సీఎం వైయస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. రెండు నెలలకే కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తే ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడకుండా జీతాలిచ్చి వారిని ఆదుకున్నారు అని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. అంతేకాకుండా సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత కూడా దాదాపు 6 నెలల పాటు ఆర్టీసీ నిధుల్లోంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఆర్టీసీకి ఉన్న అప్పులు తీర్చుకునే వెసులుబాటు కల్పించారు. దాదాపు రూ.2,553 కోట్ల అప్పులు తీర్చుకొని సంస్థ రుణ విముక్తి పొందింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.