వైట్‌హౌస్‌లో ఇటీవల కొకైన్ లభ్యమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేపట్టాయి. తాజాగా ఈ కేసులో తమ దర్యాప్తును పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాంతో పాటుగా ఈ కేసులో ఎటువంటి నిందితులను కనుక్కోలేకపోయామని, ఎటువంటి ఆధారాలు, వేలి ముద్రలు కూడా లభించకపోవడమే ఇందుకు కారణమని వారు తెలిపారు.