భర్తను భార్య చెంబుతో కొట్టిచంపిన ఘటన ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. అయినవిల్లి లంకకు చెందిన రామకృష్ణ(34) రోజూ మద్యం సేవించి భార్య సత్యనారాయణమ్మతో గొడవ పడేవాడు. గురువారం రాత్రి సైతం తాగి భార్యతో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన సత్యనారాయణమ్మ చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.